ఢిల్లీ వాయు కాలుష్యం(delhi air polution)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణించిపోతోందని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంపై దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు (supreme court) ఇవాళ విచారణ చేపట్టింది. వాయు కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందలు వేసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని, కాలుష్యానికి కారణమవుతోన్న వ్యవసాయ వ్యర్థాల దహనం వెంటనే ఆపాలని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఢిల్లీ పొరుగునే ఉన్న పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. పంట వ్యర్థాల దహనం ఆగాలి. ఎలా ఆపుతారో మాకు సంబందం లేదు. అది ప్రభుత్వాల పని, కానీ కాలుష్యం ఆగాలి. తక్షణమే జరగాలంటూ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో రేపు కేంద్రం అత్యవసర సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సరిబేసి విధానాలు పెద్దగా ప్రభావం చూపకపోవడచ్చని అభిప్రాయపడింది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.