కరవు
కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి జగన్కు కనిపించడం
లేదా అని బీజేపీ(AP BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి(PURNDARESWARI) ప్రశ్నించారు. అనంతపురంలో పర్యటించిన
పురందరేశ్వరి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
అనంత ప్రజల తాగు,సాగు నీటి
కష్టాలు తీరుస్తామని చెప్పిన వైసీపీ హామీలు ఏమయ్యాయని నిలదీశారు.
హంద్రీనీవా
సుజల స్రవంతి ద్వారా 3 లక్షల 45 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి జగన్
వాగ్దానం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
బటన్లు నొక్కుతూ రైతులను మోసం
చేస్తున్నారని దుయ్యబట్టారు.
గోదాముల
ఏర్పాటు దిశగా రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదన్న పురందరేశ్వరి, కేంద్రప్రభుత్వం రైతులకు
అందిస్తున్న సాయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలను
ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతపురం రావాల్సిన నీటిని మంత్రి పెద్దిరెడ్డి కుప్పం,
పుంగనూరు తరలించేందుకు యత్నిస్తున్నారని తమకు తెలిసిందన్నారు.