వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ(CWC-2023)లో భాగంగా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో
జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై బంగ్లాదేశ్ ( Bangladesh win
against Sri Lanka)
మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి మొదట
బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది అసలంక సెంచరీ చేయగా, ఓపెనర్ పత్తుమ్ నిస్సంక 41, సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహీశ్ తీక్షణ 22 పరుగులు చేశారు. ఓపెనర్ కుశాల్
పెరీరా (4), కెప్టెన్ కుశాల్ మెండిస్ (19) విఫలమయ్యారు. ఏంజెలో మాథ్యూస్
టైమ్డ్ అవుట్ రూపంలో వెనుదిరగాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్
బౌలర్లలో తాంజిమ్ హసన్ సకిబ్ 3, షకిబ్ అల్ హసన్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 2, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో
బంగ్లాదేశ్ జట్టు 41.1 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసి విజయభేరి మోగించింది. విజయంలో
నజ్ముల్ హుస్సేన్ శాంటో, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషించారు. శాంటో 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు చేయగా, షకిబ్ 65 బంతుల్లో 82 పరుగులు చేశాడు. షకిబ్కు ప్లేయర్ ఆఫ్
ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మహ్మదుల్లా
22, లిటన్ దాస్ 23 పరుగులు చేశారు. చివర్లో తౌహీద్ హృదయ్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మదుసంక
3, తీక్షణ 2, ఏంజెలో మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. తాజా మ్యాచ్ తర్వాత
రెండు జట్లు సెమీస్ రేస్ నుంచి ఔట్ అయ్యాడు.