తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr)కు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ సమీపంలోని ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికే అందులో సాంకేతిక లోపాలను ఫైలెట్ గుర్తించారు. వెంటనే ఎర్రవల్లి ఫాం హౌస్కు తీసుకువచ్చి సురక్షితంగా దింపారు. దీంతో సీఎం కేసీఆర్కు ప్రమాదం తప్పింది.
ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్కు ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. కాసేపట్లో మరో హెలికాఫ్టర్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరే అవకాశముంది.