తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీలు పనిచేస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ సహా, 40 మంది ప్రముఖులు రంగంలోకి దిగనున్నారు. రేపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
తెలంగాణలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 10వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. ఆ తరవాత ప్రచారం మరింత హీటెక్కనున్నాయి.
బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ఇప్పటికే రెండు దఫాలు పర్యటించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ దాస్ ప్రచారానికి రానున్నారు. తెలంగాణ ప్రచారంలో పాల్గొనే 40 మంది ముఖ్యనేతల పేర్లను ఆ పార్టీ
విడుదల చేసింది.
తెలంగాణలో ప్రచారం నిర్వహించే బీజేపీ ముఖ్య నేతలు
ప్రధాని నరేంద్ర మోదీ (pm modi) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, యడియూరప్ప, కె.లక్ష్మణ్, యోగి ఆదిత్యనాథ్ దాస్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, కిషన్‌రెడ్డి, సాధ్వి నిరంజన్ జ్యోతి, ఎల్.మురుగన్, ప్రకాశ్ జావడేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ పొల్గొంటారు.
అరవింద్ మీనన్, డీకే అరుణ, పి.మురళీధర్‌రావు, దగ్గుబాటి పురందేశ్వరి, రవికిషన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, టి.కృష్ణ ప్రసాద్ ప్రచారంలో పాల్గొంటారు.