గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలు (national games) ఘనంగా జరుగుతున్నాయి. 11వ రోజు క్రీడల పట్టికలో మహారాష్ట్ర మొత్తం 193 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సర్వీసెస్ 52 బంగారు పతకాలతో రెండో స్థానంలో ఉండగా, హర్యానా మొత్తం 128 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో తెలుగు రాష్ట్రాలకు స్థానం దక్కలేదు.
2023 జాతీయ క్రీడలు గోవాలోని మపూసా, మార్గోవా, పాంజిమ్, పోండా, వాస్కోలో జరుగుతున్నాయి. మొత్తం 28 రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది క్రీడాకారులు నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. 37వ జాతీయ క్రీడలు నవంబరు 9 వరకు జరగనున్నాయి. జాతీయ క్రీడలు గోవాలో జరగడం ఇదే మొదటిసారి.
43 ఈవెంట్స్‌లో పోటీలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ ఒలింపిక్ గేమ్స్‌తోపాటు, మల్లఖంబ్, ఖోఖో, కబడి పోటీలు నిర్వహిస్తున్నారు. అక్టోబరు 26న గోవాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ క్రీడలు ప్రారంభం అయ్యాయి.