ప్రపంచకప్ వన్డే(ODI)ల్లో భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా ఎనిమిదో వన్డే కూడా సొంతం చేసుకుంది. ఆదివారం నాడు కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత జట్టు 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 121 బంతుల్లో 101 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు, రోహిత్ శర్మ 40, జడేజా 29 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ (virat kohli) అందుకున్నారు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన కోహ్లీ, సచిన్ రికార్డును సమం చేశాడు.
327 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకే ఆలౌటైంది. జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టును కుప్పకూల్చాడు. షమి 2, కుల్దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌటైంది. వచ్చే ఆదివారం చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.
సోమవారం ఢిల్లీలో బంగ్లాదేశ్, శ్రీలంక (bangladesh VS Srilanka ) మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై కాలుష్యం మబ్బులు కమ్ముకున్నాయి. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయిలో ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంక జట్టు నిన్న ఇండోర్స్‌కే పరిమితం కాగా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాస్కులు ధరించి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రాక్టీస్ చేశారు.