వన్డే
క్రికెట్ ప్రపంచకప్ (CWC)-2023 టోర్నీలో భాగంగా కోల్ కతాలోని
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా(BHARAT VS SOUTH AFRICA) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ
సేన, బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తొలి బాల్
నుంచి దూకుడు ప్రదర్శించారు. ఐదో ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ బోర్డు 61కి
చేరింది. రోహిత్ శర్మ(24 బంతుల్లో 40)పరుగులు చేసి ఔటయ్యాడు. కగిసో రబడ బౌలింగ్ లో
బవుమాకు క్యాచ్ అందించాడు.
10.3 బంతికి శుభమన్
గిల్(23) కూడా పెవిలియన్ చేరాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 62
పరుగుల వద్ద రోహిత్ ఔట్ కాగా, 93 రన్స్ వద్ద గిల్ వెనుదిరిగాడు.
విరాట్ కోహ్లీ కేశవ్
మహరాజ్ వేసిన 28.2 బంతికి కోహ్లీ అర్ధశతకం పూర్తి చేశాడు. 29 ఓవర్లకు
శ్రేయస్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డును
170కి తీసుకెళ్ళారు. జాన్సన్
వేసిన 30.2 ఓవర్ లో అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
36.5 బంతికి శ్రేయస్ అయ్యర్ 77 పరుగుల వద్ద
ఔట్ అయ్యాడు. ఎంగిడి బౌలింగ్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ – అయ్యర్లు
మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. దీంతో 37 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 227
పరుగులు చేసింది.
42.1
ఓవర్ లో కేఎల్ రాహుల్ కూడా నిరాశపరిచాడు. జాన్సన్ బౌలింగ్ లో 8 పరుగుల వద్ద ఔట్
అయ్యాడు. 43 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది.
రాహుల్ ప్లేస్ లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్
యాదవ్ కూడా తక్కువ స్కోర్ కే వెనుదిరిగాడు. 22 పరుగుల వద్ద షంసి బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 47
ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 293 పరుగులు చేశారు. రబడా వేసిన 48.3 ఓవర్ లో కోహ్లీ
సెంచరీ పూర్తి చేశాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. తాజా
ఘనతతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లి సమం చేశాడు. ఓవరాల్‌గా
ఇది విరాట్‌కు 78 అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.
రవీంద్ర జడేజా 15 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్
చివరి బంతిని ఆడిన కోహ్లీ రెండు పరుగులు చేశాడు. దీంతో భారత్ 50 ఓవర్లకు
ఐదు వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. కోహ్లీ(102), జడేజా (29) నాటౌట్ గా
ఉన్నారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి,
జాన్సన్, రబడ, మహరాజ్, షంసీ తలా ఒక వికెట్ తీశారు.