హమాస్(HAMAS) ఉగ్రవాదులను అంతం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. ఆ దేశ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత కలవరపెడుతున్నాయి. గాజాపై కొనసాగుతోన్న యుద్ధంలో అణుబాంబును ప్రయోగించడం కూడా తమ
ముందు ఉన్న అవకాశాల్లో ఒకటని పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఇజ్రాయెల్
మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత కలవరపెట్టాయి. దీనిపై ప్రధాని బెంజమిన్
నెతన్యాహు (Benjamin Netanyahu) తక్షణమే
స్పందిస్తూ.. మంత్రి వ్యాఖ్యలు వాస్తవదూరమన్నారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి
నడుచుకుంటామన్నారు.
‘గాజాపై జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడటం
కూడా మా వద్ద ఉన్న ఒక ఎంపిక. అక్కడ సామాన్యులు ఎవరూ లేరు. గాజాకు మానవతా సాయం
అందించడం ఓ వైఫల్యమే అవుతుంది’ అని స్థానిక రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్
మంత్రి అమిచాయ్ ఎలియాహు పేర్కొన్నారు.
గాజాపై దాడులు ఉద్ధృతం చేసిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పటివరకు 2,500 స్థావరాలపై
దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణదళం (IDF) వెల్లడించింది.
హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే వరకు ఈ ముఖాముఖి పోరును కొనసాగిస్తామని, ఉగ్రవాద
స్థావరాలు, వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని స్పష్టం
చేసింది.