‘పీఎం గరీబ్ యోజన’(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) పథకాన్ని మరో ఐదేళ్ళు
పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) తెలిపారు. ఈ ఏడాది ఆఖరుకు పథకం గడువు
ముగుస్తున్నప్పటికీ పేదల కోసం పొడిగిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లు ఉచిత రేషన్ గ్యారెంటీ కొనసాగించాలని నిర్ణయించామన్నారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని సియోనిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్లో
సుపరిపాలన, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఉంటే భరోసా ఉంటుందని, బీజేపీ ఉంటే వికాసం
ఉంటుందని, బీజేపీ ఉంటే
భవిష్యత్తు బాగుంటుందని యావత్ రాష్ట్రం భావిస్తోందన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో ఆహారకొరత
లేకుండా చేశామని, ఉచిత రేషన్ ఇచ్చామని చెప్పారు.
గిరిజనులకు కాంగ్రెస్
పార్టీ చేసిందేమీ లేదన్న ప్రధాని…కాంగ్రెస్ పరిపాలన కుంభకోణాలమయం అన్నారు.
పేదరికం
గురించి తాను పుస్తకాల్లో చదువుకోలేదన్న ప్రదాని మోదీ, ఆ బాధను తాను అనుభవించానని తెలిపారు.
అందుకే ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ళు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనులు,
దళితులు, వెనుకబడిన వర్గాలంతా బీజేపీ కుటుంబసభ్యులే అన్నారు.