వన్డే
ప్రపంచకప్ (CWC)-2023 టోర్నీలో భాగంగా కోల్ కతాలోని
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగతున్న మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా(BHARAT VS ) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ
సేన, బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత
జట్టు గత మ్యాచ్ లో ఆడిన వారితోనే ఆడుతుండగా,
సఫారీ జట్టు ఒక మార్పు చేసింది. పేసర్ గెరాల్డ్ కొయొట్టీ స్థానంలో తబ్రేజ్ షంషి
తుది జట్టులోకి వచ్చాడు.
భారత్
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తొలి బాల్ నుంచి దూకుడు ప్రదర్శించారు.
మూడు ఓవర్లలోనే 35 పరుగులు సాధించారు. వైడ్ల రూపంలోనే 9 పరుగులు వచ్చాయి. నాలుగో
ఓవర్లో 10 రన్స్ రాబట్టారు. ఐదో ఓవర్ లో
ఏకంగా 16 రన్స్ రాబట్టారు. ఓవర్ ముగిసే సరికి భారత్ స్కోర్ బోర్డు 61కి చేరింది.
రోహిత్ శర్మ(24 బంతుల్లో 40)పరుగులు చేసి ఔటయ్యాడు. కగిసో రబడ బౌలింగ్ లో క్యాచ్
బవుమాకు క్యాచ్ అందించాడు. శుభమన్ గిల్(12), విరాట్ కోహ్లీ ఆడుతున్నారు.
టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన భారత్
ఏడింట్లోనూ గెలవగా, దక్షిణాఫ్రికా 7
మ్యాచ్ లు ఆడి 6
నెగ్గింది. రెండు జట్లు
సెమీస్ కు అర్హత సాధించాయి.
దక్షిణాఫ్రికా
జట్టు…
క్వింటన్
డి కాక్(వీకెట్ కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెస్, ఎయిడెన్
మార్ర్కమ్, హెన్రిచ్ క్లాసెస్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి,
కేశవమహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
భారత
జట్టు…
రోహిత్
శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వీకెట్
కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,
కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.