హమాస్(HAMAS) దాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్(ISRAEL) జరుపుతున్న వైమానిక దాడుల్లో సామాన్యులు
మరణిస్తున్నారని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హమాస్, ఇజ్రాయెల్
దాడులు విరుమించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని
బ్లింకెన్ తో భేటీ సందర్భంగా తమ ఆవేదన వెలిబుచ్చారు.
కాల్పుల
విరమణతో హమాస్ పైచేయి సాధించినట్లు అవుతుందని, మళ్ళీ బలపడి దాడులకు పాల్పడే అవకాశం
ఉందని బ్లింకన్ అనుమానం వ్యక్తం చేశారు.
అమ్మాన్ లో ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా,
ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్యవేత్తలతో పాటు పాలస్తీనా అథారిటీ అధికారి,
బ్లింకెన్ తో సమావేశమయ్యారు.
ఆత్మరక్షణ
కోసమే గాజాలో దాడులు చేస్తామని చెబుతున్న ఇజ్రాయెల్ వాదన సరికాదు అని ఈజిప్టు
చెప్పింది. ఇజ్రాయెల్ చర్య గాజాలోని పాలస్తీనీయులను మూకుమ్మడిగా శిక్షిస్తున్నట్లు
ఉందని తెలిపింది.
హమాస్ దాడికి ప్రతిదాడి జరపడం ఇజ్రాయేలీయుల హక్కు అని బ్లింకన్
బదులిచ్చారు. మానవతా సాయం దృష్ట్యా
ఇజ్రాయెల్ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేయాలనే ప్రతిపాదనకు తాము
సానుకూలమన్నారు. తద్వారా గాజాలోని పౌరులకు అవసరమైన సామాగ్రి చేరవేతకు విదేశీయులు
ఈజిప్టులోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
దాడులు
తాత్కాలిక నిలిపివేతకు సిద్ధంగా లేమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు
తెలిపారు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమ పౌరులను వదిలిపెట్టే వరకు దాడుల
కొనసాగుతాయని స్పష్టం చేశారు.