దీపావళి సందర్భంగా ప్రయాణీకుల కోసం రైల్వేశాఖ(Deepavali special) ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్-భువనేశ్వర్
మధ్య ప్రత్యేక రైలు సర్వీసు (నెంబర్ 06073) నడపనున్నారు. ఈ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్
నుంచి రాత్రి 11.45కి బయల్దేరి, మర్నాడు
సాయంత్రం 6.30కి భువనేశ్వర్ చేరుకుంటుంది.
రిటర్న్ జర్నీ కోసం ఈ నెల 14, 21, 28 తేదీల్లో
భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్‌కు నడపనుంది.
చెన్నై-భువనేశ్వర్ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని
గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు
రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక
రైళ్లు నడపనున్నారు.. ఈ నెల 11, 18, 25 న చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చికి స్పెషల్ సూపర్ ఫాస్ట్
(నెంబర్ 06071) ఏర్పాటు
చేశారు.
చెన్నై సెంట్రల్లో రాత్రి 11.45కి ఈ రైలు
బయల్దేరి, మూడో రోజు
తెల్లవారుజామున 3.45కి సంత్రాగచ్చికి చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌కి ప్రత్యేక
సూపర్ ఫాస్ట్ రైలు (నెంబర్ 06072) నడపనున్నారు.
ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లోని
గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు
రైల్వేస్టేషన్లలో ఆగుతాయి