క్రికెట్ వరల్డ్కప్(CWC)-2023 టోర్నీలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా
విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో
ఇంగ్లండ్ పై ఆసీస్ 33 పరుగుల తేడాతో నెగ్గింది.
టాస్ ఓడి మొదట
బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులు చేసి ఓడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 64 పరుగులు చేయగా, ఓపెనర్ డేవిడ్ మలాన్
50, మొయిన్ అలీ 42 పరుగులు చేశారు.
ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2, పాట్ కమిన్స్ 2, స్టొయినిస్ 1 వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్
వార్నర్ నిరాశపరిచారు. దీంతో 38 పరుగుల వద్ద ఆసీస్ రెండు వికెట్లు నష్టపోయి
కష్టాల్లో పడింది. క్రిస్ వోక్స్
వేసిన 1.4 బంతికి ట్రావిస్ హెడ్ జో రూట్ కు క్యాచ్ అందించి పెవిలియన్ చేరారు.
డేవిడ్ వార్నర్ కూడా వోక్స్ బౌలింగ్ లోనే క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం
క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్, లబుషేన్ ఇన్నింగ్స్ ను సరిదిద్దే ప్రయత్నం
చేశారు. స్మిత్ 52 బంతుల్లో 44 పరుగులు చేసి ఔట్ కాగా, జేపీ ఇంగ్లిస్ కూడా(3) ఔట్
అయ్యాడు. లబుషేన్ 83 బంతుల్లో 71 రన్స్ చేశాడు. కానీ మార్క్ వుడ్ బౌలింగ్ లో
ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది.
స్టీవ్ స్మిత్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో
మొయిన్ అలీకి క్యాచ్ గా దొరికిపోయాడు. 36 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు
నష్టపోయి 197 పరుగులు చేసింది.
కామోరిన్
గ్రీన్(47) వద్ద బౌల్డ్ అయ్యాడు. డేవిడ్
విల్లే వేసిన 40.4 బంతికి వెనుదిరిగాడు. మార్కుస్ స్టోనిస్ 32 బంతులు ఆడి 35 పరుగులు చేశాడు. లివింగ్
స్టోన్ వేసిన 43.4
బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. పాట్
కమిన్స్ 13 బంతుల్లో 10 పరుగులు చేసి నిరాశపరిచాడు. 46 ఓవర్లకు 257 పరుగులు
చేశారు. 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.