తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వామపక్షాలు ఒంటరి పోరాటానికి సిద్దం అయ్యాయి. సీపీఎం 14 స్థానాలకు మొదటి జాబితా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం
చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపకపోవడంతో పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం 17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీసీఎం ప్రకటించింది. 14 మందితో తొలిజాబితా విడుదల చేసింది. ఆదివారం మరో 3 స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశముంది.
భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట పిట్టల అర్జున్, పాలేరు తమ్మినేని వీరభద్రం, మధిర పాలడుగు భాస్కర్, వైరా భూక్యా వీరభద్రం, ఖమ్మం ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి మాచర్ల భారతి, మిర్యాలగూడ జాలకంటి రంగారెడ్డి, నకిరేకల్ చినవెంకులు, భువనగిరి కొండమడుగు నర్సింహ, జనగాం మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం పగడాల యాదయ్య, పటాన్చెరు జె.మల్లిఖార్జున్, ముషీరాబాద్ ఎం దశరథ్ పేర్లను ప్రకటించారు.