క్రికెట్ వరల్డ్కప్(CWC)-2023 టోర్నీలో భాగంగా న్యూజీలాండ్ పై పాకిస్తాన్(New Zealand vs Pakistan) అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు సార్లు అంతరాయం
ఏర్పడగా డీఎల్ఎస్
పద్ధతిలో పాకిస్తాన్
విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్
చేసిన న్యూజీలాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది.
నిర్ణీత 50 ఓవర్లలో 401 పరుగులు చేసింది.
402 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ దూకుడుగా
ఆడింది. 21 ఓవర్ల దగ్గర వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
దీంతో
అంపైర్లు మ్యాచును 41 ఓవర్లకు 342 పరుగుల లక్ష్యంతో కుదించారు. నాలుగు ఓవర్ల
తర్వాత మళ్లీ వర్షం కురిసింది. దీంతో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 21
పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫకర్
జమాన్(126), కెప్టన్ ఆజమ్(66) రాణించారు. తాజా విజయంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు పదిలమయ్యాయి.
అంతకు
ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ రికార్డు స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108) సెంచరీతో చెలరేగితే.. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ కేన్
విలియమ్సన్ (79 బంతుల్లో 95) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (41), మార్క్ చాప్మన్ (39), కాన్వే (35) కూడా రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో వసీమ్ 3 వికెట్లు పడగొట్టాడు.