తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ అలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని ఓ హోటల్లో తుపాకీతో కాల్చుకుని ఫజల్ అలీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అలీ కుమారుడితో ఫోన్లో మాట్లాడిన తరవాత తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఫజల్ అలీ ఆత్మహత్య (suicide) గురించి తెలియగానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫజల్ అలీ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలా? మరేవైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.