ఛత్తీస్గఢ్
ఎన్నికల(Chhattisgarh) ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్( CM BHUPESH BAGHEL) పై ప్రధాని మోదీ (PM MODI) విమర్శలు గుప్పించారు. సీఎం హోదాలో
అక్రమంగా సొమ్ము పోగేసి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం వాడుతున్నారని దుయ్యబట్టారు.
ఛత్తీస్గఢ్ లోని పాలక కాంగ్రెస్ పార్టీ ఆఖరకు మహాదేవుడిని కూడా వదల్లేదంటూ తీవ్ర
ఆరోపణలు చేశారు.
రాష్ట్రాన్ని
లూటీ చేసేందుకు పాలక కాంగ్రెస్ ప్రతీ అవకాశాన్నీ వాడుకుందని దుయ్యబట్టిన మోదీ,
ఆఖరకు మహాదేవుడి పేరును కూడా వదల్లేదన్నారు. దుర్గ్ లో నిర్వహించిన ఎన్నికల
ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ… కాంగ్రెస్ పాలన అవినీతి, అక్రమాల అడ్డా అంటూ
వ్యాఖ్యానించారు.
బీజేపీకి అధికారమిస్తే అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ నేతలు దోచుకున్న ప్రతి పైసాకి లెక్క
చెప్పిస్తామన్నారు. కుంభకోణాలపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపిస్తామని
చెప్పారు.
సంచలనం
రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ లో సీఎం భూపేశ్ బఘేల్ కు రూ. 508 కోట్లు ముట్టినట్లు
ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ కోరియర్ రూ. 5 కోట్లు
భూపేశ్ కు చేరవేస్తూ ఈడీ అధికారులకు చిక్కాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు
ఈడీ అధికారులు ముఖ్యమంత్రిపై నిఘా పెట్టారు.