వన్డే
క్రికెట్ వరల్డ్ కప్(CWC)-2023 టోర్నీలో భాగంగా జరుగుతున్న 35వ మ్యాచ్
లో న్యూజీలాండ్, పాకిస్తాన్ (New Zealand vs Pakistan)తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగుతున్న ఈ
మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ టీమ్
బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కివీస్ బ్యాటర్లు పాకిస్తాన్ బౌలర్లపై బారీ
షాట్లతో విరుచుకుపడ్డారు.
టాప్
ఆర్డర్ చెలరేగడంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 401
పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 402 పరుగుల టార్గెట్ ఉంచింది.
టాస్
ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర మంచి ఇన్నింగ్స్
ఆడారు.
కివీస్ 68 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. హసన్ అలీ వేసిన 10.5 వ
బంతికి కీపర్ రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి కాన్వే పెవిలియన్ చేరారు. కేన్, రచిన్
దూకుడుగా ఆడి రెండో వికెట్ కు 180 పరుగులు జోడించారు. కేన్ విలియమ్స్ 79 బంతుల్లో 95
పరుగులు చేసి ఔటయ్యాడు. ఇఫ్తికర్ అహ్మద్ వేసిన 34.2 బంతికి జమాన్కు క్యాచ్
ఇచ్చాడు.
35.5 బంతికి రచిన్ రవీంద్ర కూడా వెనుదిరిగాడు. 94 బంతుల్లో 108 పరుగులు
చేసి క్యాచ్ ఔటయ్యాడు. వాసిమ్ బౌలింగ్ లో
షాట్ కు ప్రయత్నించి షకీల్ కు చిక్కాడు.
డారిల్ మిచెల్ 29, మార్క్ చాప్ మన్ 39 పరుగులు చేశారు. గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ కూడా ధాటిగా ఆడడంతో కివీస్
స్కోరు 400 మార్కు దాటింది. గ్లిన్
ఫిలిప్స్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి ఔటయ్యాడు.
శాంట్నర్ 17 బంతుల్లో 2 సిక్సులతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టామ్ లతామ్ 2 పరుగులు చేయడంతో
న్యూజీలాండ్ జట్టు 50 ఓవర్లలో 401 పరుగులు చేసింది.
పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం 3
వికెట్లు తీయగా,
హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్,
హరీస్ రవూఫ్ తలా ఒక వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
భారతీయ మూలాలున్న న్యూజీలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం
చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్ లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా
రవీంద్ర రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు 3 శతకాలు నమోదు
చేశాడు.