Pakfoils terror
attack at Air Base, three terrorists neutralised
పాకిస్తాన్
పంజాబ్ ప్రొవిన్స్‌లోని మియావలీ ట్రయినింగ్ ఎయిర్‌బేస్ మీద ఉగ్రవాదుల దాడి ప్రయత్నాన్ని
నిర్వీర్యం చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో ప్రవేశించడానికి
ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు మట్టుపెట్టారు. మరో ముగ్గురు
ఉగ్రవాదులను అడ్డుకోగలిగారు.
పాక్
సైన్యం ప్రకటన ప్రకారం ఈ తెల్లవారుజామున మియావలీ ట్రయినింగ్ ఎయిర్‌బేస్ వద్ద
ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. వారిని పాక్ సైన్యం సమర్థంగా అడ్డుకోగలిగింది.
సైనిక బలగాలు సత్వరం వేగంగా స్పందించడం వల్ల ఎయిర్‌బేస్‌లోని వ్యక్తులకు కానీ,
ఎయిర్‌బేస్ ఆస్తులకు కానీ ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. దాడికి ప్రయత్నించిన
ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ముగ్గురు ఉగ్రవాదులను నిభైలువరించారు.
వారిని పట్టుకోడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
పాకిస్తాన్
మీడియా కథనాల ప్రకారం ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ తెహరీక్ ఎ జిహాద్ ఈ దాడికి తామే
పాల్పడినట్లు ప్రకటించుకుంది.
గత వారం
రోజుల్లో ఉగ్రవాదులు పాకిస్తాన్ భద్రతా బలగాలపై ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్‌లో రెండు
చోట్ల దాడులకు తెగబడ్డారు. ఖైబర్ జిల్లా తిరా ప్రాంతంలో జరిగిన దాడిని పాక్ సైన్యం
అడ్డుకుంది. అక్కడ ఒక ఉగ్రవాది హతమయ్యాడు, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నారు.
మరో ఘటనలో
దక్షిణ వజీరిస్తాన్ జిల్లా సర్వేకయ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్
డివైజ్ (ఐఈడీ)ని పేల్చారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు, ఒక సిపాయి ప్రాణాలు
కోల్పోయారు.