వన్డే క్రికెట్ ప్రపంచకప్ ( World Cup)-2023 టోర్నీలో
అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళుతున్న భారత జట్టుకు ఓ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్
పాండ్య (Hardik
Pandya)
జట్టుకు దూరమైనట్లు ఐసీసీ (ICC) వెల్లడించింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో అతడు
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి (NCA) వెళ్లిపోయాడు. తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని మేనేజ్మెంట్
చెప్పినా.. గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. మిగతా
మ్యాచ్‌లకు హార్దిక్ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. హార్దిక్ స్థానాన్ని పేసర్
ప్రసిధ్ కృష్ణతో జట్టు భర్తీ చేసింది.
‘ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో విజయభేరీ
మోగిస్తున్న భారత్ జట్టుకు ఎదురుదెబ్బ. హార్దిక్ పాండ్య చీలమండ గాయం నుంచి ఇంకా
కోలుకోలేదు. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు
అతడు దూరమవుతున్నాడు. పాండ్య స్థానంలో ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు. ఈ మేరకు
టోర్నమెంట్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది’ అని ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.
హార్దిక్ పాండ్య ఈ వరల్డ్‌కప్‌లో
బంగ్లాదేశ్‌తో కేవలం మూడు బంతులు వేశాడు. అంతకు ముందు మూడు మ్యాచుల్లో ఐదు
వికెట్లు తీశాడు
పేసర్ ప్రసిధ్ కృష్ణకు కేవలం 19 వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్
తీసుకున్నాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్
వేదికగా జరిగే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ప్రసిధ్ కృష్ణ
జట్టుతో కలవనున్నాడు.