ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (CWC) -2023 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై ఆప్ఘనిస్తాన్(Netherlands vs Afghanistan ) విజయం సాధించింది. ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు
ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో
స్థానానికి ఎగబాకింది.
లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆప్ఘన్ జట్టు డచ్ టీమ్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన
నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలింది. ఆప్ఘన్ జట్టు180 పరుగుల లక్ష్యాన్ని
కేవలం 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి
ఛేదించింది. తాజా గెలుపుతో ఆప్ఘన్ సెమీస్ అవకాశాలు కాస్త మెరుగుపడ్డాయి.
కెప్టెన్ హష్మతుల్లా షాహిది 56 పరుగులతో నాటౌట్ గా
నిలవగా, రహ్మత్ షా 52 పరుగులు చేశాడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్ (31*) సత్తా చాటాడు. అంతకుముందు, ఓపెనర్లు రహ్మనుల్లా
గుర్బాజ్ 10, ఇబ్రహీం జాద్రాన్ 20
పరుగులు చేశారు. డచ్ బౌలర్లలో
లోగాన్ వాన్ బీక్, వాన్ డెర్ మెర్వ్ ,
షకీబ్ జుల్ఫికర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు అత్యంత పేలవంగా
ఆడింది. తొలి ఓవర్లోనే బారెసి (1) ఔట్ అయ్యాడు. ఓడౌడ్, ఆకర్మ్యాన్ (29) కలిసి
ఇన్నింగ్స్ నిర్మించారు. రెండో వికెట్కు 70
పరుగులు జోడించారు. 11
ఓవర్లు ముగిసే సరికి డచ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.
తర్వాతి ఓవర్లోనే రెండో
పరుగుకు ప్రయత్నించిన ఓడౌడ్.. రన్ ఔట్ అయ్యాడు. ఎడ్వర్డ్స్ (0) వరుసగా రనౌట్ అవడం
మరింత దెబ్బతీసింది. సిబ్రాండ్ కూడా రనౌట్గానే వెనుదిరిగాడు. 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఎంగిల్బెర్త్ (58; 6 ఫోర్లు), మ్యాక్స్ ఓడౌడ్ (42; 9 ఫోర్లు) రాణించారు.