ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో(Chhattisgarh
Elections) లో గెలుపు
కోసం బీజేపీ(BJP) తీవ్రంగా శ్రమిస్తోంది. పాలక కాంగ్రెస్ పార్టీకి
పోటీగా ప్రచార పర్వంలో దూసుకెళుతోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(AMIT SHAH) ఆ పార్టీ
మేనిఫెస్టో(Manifesto) విడుదల చేశారు. వివాహితలకు ఏడాదికి రూ.12 వేల
ఆర్థికసాయంతో పాటు కీలక వాగ్దానాలు చేశారు.
బీజేపీని గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో
ఛత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
రెండేళ్ళలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని
చెప్పిన బీజేపీ, పేదలకు రూ.500కే గ్యాస్ సిలండర్ అందజేస్తామంది. క్వింటాలుకు రూ.3,100 చొప్పున
ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి
రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
రాయ్‌పుర్, నయా రాయ్‌పుర్, దుర్గ్, భిలాయ్
ప్రాంతాల అభివృద్ధి కోసం దిల్లీ ఎన్సీఆర్ మాదిరి రాష్ట్ర రాజధాని ప్రాంతం (ఎస్ఈఆర్)
ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో లో పేర్కొన్నారు.
పండరియాలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడిన అమిత్
షా…ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, రాష్ట్ర ఖజానాను ఏటీఎంగా మార్చేసి
కాంగ్రెస్ హైకమాండ్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ తయారు
చేసిన ‘ప్రీపెయిడ్ సీఎం’ అని ఎద్దేవా చేశారు. బఘెల్ మరోసారి అధికారంలోకి వస్తే..
రాష్ట్రం నుంచి వేల కోట్లను కాంగ్రెస్ పార్టీ స్వాహా చేస్తుందని ఆరోపించారు.