ఐసీసీ వన్డే
వరల్డ్ కప్(CWC)-2023
టోర్నీలో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ (Afghanistan
vs Netherlands) జట్లు తలపడుతున్నాయి.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం
ఈ పోరుకు వేదికగా ఉంది. టాస్
గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ కు దిగింది. 46.3 ఓవర్లకు 179 పరుగలు చేసి ఆలౌటైంది.
నెదర్లాండ్స్ ఓపెనర్ వెస్లీ బరేసి మొదటి
ఓవర్ ఐదో బంతికే ఔట్ అయ్యాడు. ముజీబ్ ఉర్ రెహమాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా
వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ 40 బంతుల్లో 42 పరుగులు చేసి రన్ ఔట్
అయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లుకోల్పోయి 74 పరుగులు చేసింది. మూడో
వికెట్ కూడా రన్ ఔట్ రూపంలోనే నష్టపోయింది. 18.3 బంతికి కోలిన్ అకెర్మాన్
వెనుదిరిగాడు. అకెర్మాన్ (29)ను రషీద్ ఖాన్ పెవిలియన్ కు పంపాడు.
స్కాట్ ఎడ్వర్డ్స్(0) కూడా రన్ ఔట్ కావడంతో
డచ్ జట్టు కష్టాల్లో పడింది.
సిబ్రాండ్ ఎంగిల్ బ్రెక్ట్ ఒంటరి పోరాటం చేశాడు. 86
బంతుల్లో 58 పరుగులు చేసి రన్ ఔట్ గా వెనుదిరిగాడు. బాస్ డీ లీడే ఆరు బంతులు ఆడి మూడు పరుగులు చేసి
ఔట్ అయ్యాడు.
సకిబ్ జుల్ఫికర్(3) నూర్ అహ్మద్ బౌలింగ్ లో నిరాశపరిచాడు. లోగాన్ వీ బాక్(2) మహమద్ నబీ బౌలింగ్ లో పెవిలియన్ కు క్యూ
కట్టాడు. 92 పరుగుల వద్ద 3,4 వికెట్లు నష్టపోగా, 97 వద్ద ఐదో వికెట్, 113 వద్ద ఆరో
వికెట్ కోల్పోయింది. ఏడో వికెట్
134 వద్ద కోల్పోయింది. లోగాన్ వాన్ బీక్
స్టంప్ ఔట్ అయ్యాడు. బ్రెక్ట్ వెనుదిరగడంతో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు
చేసింది.
రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ 33 బంతులు ఆడి 11 పరుగులు చేసి విఫలమయ్యాడు. పాల్ వాన్ మీకెరెన్(4) ఔట్ కావడంతో నెదర్లాండ్స్
ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్యన్ దత్(10)నాటౌట్. 46.3 ఓవర్లకు 179 పరుగులు చేశారు.
మహమద్
నబీ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒక వికెట్
పడగొట్టారు. నెదర్లాండ్స్ టాప్ 5 బ్యాటర్స్ లో నలుగురు రన్ ఔట్ అయ్యారు. వరల్డ్
కప్ టోర్నీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాన్ ఆరోస్థానంలో ఉండగా
నెదర్లాండ్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ జట్టు 6 మ్యాచ్
లు ఆడి మూడింట్లో గెలవగా, నెదర్లాండ్స్
జట్టు 6 మ్యాచ్ లు ఆడి రెండింట నెగ్గింది.