ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలోని ఓ గ్రామంలో అరాచకం చోటుచేసుకుంది. 40 ఏళ్ల దళిత మహిళలను అత్యాచారం (dalit woman raped)చేసి, తరవాత శరీరాన్ని ముక్కలు చేసి నిందితుడు పరారయ్యాడు. పిండి మిల్లును శుభ్రం చేయడానికి వచ్చిన మహిళపై యజమాని రాజ్‌కుమార్ శుక్లా అత్యాచారానికి పాల్పడ్డాడు. శుభ్రం చేయడానికి వచ్చిన మహిళను పిండి మిల్లులో బంధించి రాజ్‌కుమార్ అత్యాచారం చేశాడు. లోపలి నుంచి అరుపులు, కేకలు వినిపించడంతో బాధిత మహిళతో వచ్చిన ఆమె 20 సంవత్సరాల కూతురు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పిండి మిల్లులో దళిత మహిళను ముక్కలుగా నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.
పిండి మిల్లు యజమాని రాజ్‌కుమార్ శుక్లా, అతని సోదరుడు బౌవా శుక్లా, రామకృష్ణ శుక్లాపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారయ్యారని పోలీసు అధికారి తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు.