తెలంగాణ ఎన్నికల్లో పోటీ పై వైఎస్ఆర్టీపీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(SHARMILA) స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదని (not to contest Telangana) తెలిపిన షర్మిల… ఈ దఫా ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులన్నా, కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో తాను
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసినప్పుడు… తనను కుటుంబ
సభ్యురాలిగా ప్రేమాభిమానాలు చూపారన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో
అడుగు పెడతాననే పూర్తి నమ్మకం ఉందని
తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని…
అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండాలని నిర్ణయించామని
చెప్పారు.
కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడకూడదనే
నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.