రాష్ట్రప్రభుత్వంపై
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి (AP BJP CHIEF PURANDARESWARI)మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ విధానాలపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై
కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇతరులపై కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు.
మద్యం
పాలసీపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందన్నారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకు
వెళుతోందన్నపురందరేశ్వరి,
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందన్నారు.
రాబోయే
ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి పోటీ చేసే అంశంపై అధిష్టానం నిర్ణయం
తీసుకుంటుందన్నారు.
ఉమ్మడి
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న పురందరేశ్వరి, కేంద్రప్రభుత్వం సాయంతో జరుగుతున్న
అభివృద్ధి పనులను స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. తిరుపతి రైల్వేస్టేషన్
ఆధునికీకరణ పనులతో పాటు స్మార్ట్ సిటీగా అభివృద్ధికి కేంద్రం చేసిన సాయాన్ని
స్థానికులకు వివరించారు.
నేడు
కాణిపాకంలో పర్యటించిన పురందరేశ్వరి, వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక
పూజలు చేశారు. ఆమెకు బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో స్వాగతం పలికాయి.