సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (cm ys jaganmohanreddy) అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.రాష్ట్రంలో కుల,సామాజిక, ఆర్థిక అంశాల గణనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.నంద్యాల, కడప జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌కు 5400 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయిం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్నూలులో లా వర్సిటీకి 100 ఎకరాల భూమి కేటాయించారు. కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదించారు. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపు విధానాలకు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.