ఇండియన్
పీనల్ కోడ్(IPC) లోని సెక్షన్ 302కు, శ్రీలంకపై భారత్
విజయానికి లింక్ పెడుతూ సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. శ్రీలంకపై భారత్(SRILANKA VS BHRAT) ఘన విజయాన్ని(WIN) కీర్తిస్తూ దిల్లీ పోలీసులు చేసిన ఓ
ట్వీట్ వైరల్ అవుతోంది.
దిల్లీ పోలీసుల సృజనాత్మకత, హాస్య చతురత, క్రీడాస్ఫూర్తి
పై నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. దిల్లీ పోలీసుల పుణ్యమా అంటూ 302 పై
గూగుల్లో శోధిస్తున్నారు.
ఇంతకీ
302కి భారత క్రికెట్ జట్టుకు సంబంధం ఏంటంటే..ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శ్రీలంకపై
భారత్ ఘనవిజయం సాధించింది. లంకేయులను అవలీలగా ఓడించిన రోహిత్ సేన ఓ రికార్డును
నెలకొల్పింది. 55 పరుగులకే శ్రీలంక జట్టును ఆలౌట్ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా
సంబరాలు జరిగాయి. వాటిని సోషల్ మీడియాలో
పలువురు పంచుకున్నారు.
302 పరుగుల తేడాతో భారత్
జట్టు విజయం సాధించడాన్ని భారతీయ శిక్షా స్మృతి లోని సెక్షన్ 302 తో పోలుస్తూ
దిల్లీ పోలీసులు ఓ ట్విట్ చేశారు.
302
అనేది హత్యానేరాలకు సంబంధించిన సెక్షన్, ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువు అయితే మరణశిక్ష,
జీవిత ఖైదు విధిస్తారు. నేర తీవ్రతను బట్టి శిక్షను నిర్ణయిస్తారు. దీనిని కోట్
చేసేలా సరదాగా భారత్ 302 కిల్లింగ్ పెర్ఫామెన్స్, శ్రీలంకను చంపేశారు అని అర్థం
వచ్చేలా రాశారు. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. మంచి హాస్య చతురత అని ఒకరు
కితాబిస్తే, దయచేసి మన ఆటగాళ్లను శిక్షించవద్దు అంటూ మరికొంతమంది ఫన్నీ గా రిప్లై
ఇచ్చారు. స్టాండప్ కామెడీకి ప్రయత్నించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.