తిరుమల(Tirumala)లో డిసెంబర్ 23న శ్రీవారి ఆలయంలో
వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి
పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పది రోజుల పాటు
వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు.
వైకుంఠ
ద్వార దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లను టీటీడీ
ఈ నెల 10న ఆన్లైన్ లో విడుదల చేయనుంది.
రోజుకు
2 వేల చొప్పున పదిరోజుల పాటు 2.25 లక్షల టిక్కెట్లు విడుదల చేసే అవకాశముంది. వచ్చే
నెల 21న ఉదయం సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోని 9 కేంద్రాల్లో జారీచేయనుంది. 10
రోజులకు గాను 4.25 లక్షల ఎస్డీ టోకెన్లను భక్తులకు జారీ చేయనుంది.
అక్టోబర్
లో తిరుమలేశుడిని 21.75 లక్షల మంది దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 108.65
కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 1.05 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది.
ఇంద్రకీలాద్రిపై
ఈ నెల 14 నుంచి డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో
భాగంగా ప్రతీరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని
వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి
ప్రదక్షిణ, బిల్వార్చన చేస్తారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న
సరస్వతి యాగం, 17న నాగుల చవితి నిర్వహిస్తారు.