టీడీపీ
అధినేత చంద్రబాబు(CHANDRABABU)కు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర
బెయిల్ షరతులకు తోడు అదనపు ఆంక్షలు విధించాలని సీఐడీ(AP CID) వేసిన అనుబంధ పిటిషన్ పై న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
స్కిల్ కేసు(SKILL CASE) అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో
జారీ చేసిన ఆదేశాలు కొనసాగుతాయన్న హైకోర్టు(AP HIGHCOURT).. చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలనే
సీఐడీ ప్రతిపాదనను తిరస్కరించింది. రాజకీయ ర్యాలీలలో చంద్రబాబు పాల్గొనవద్దని
గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
స్కిల్
కేసులో అరెస్టు అయి జుడీషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు
చికిత్స కోసం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో
మరికొన్నింటిని చేర్చాలని సీఐడీ అదనపు పిటిషన్ వేసింది. దీనిపై గతంలోనే వాదనలు
పూర్తి కాగా తీర్పు నేటికి రిజర్వు అయింది. ఇవాళ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.