మైలార్డ్(My Lord) అని న్యాయవాదులు తనను పదేపదే
సంబోధించడంపై ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలార్డ్,
యువర్ లార్డ్‌షిప్ అనే పదాలు జడ్జిని ఉద్దేశించి గౌరవసూచకంగా పిలవడం భారత న్యాయప్రక్రియలో
సహజం. ఈ పదాలు వలసపాలన ఆనవాళ్ళుగా
ఉన్నాయని, వాటిని ఉపయోగించవద్దంటూ గతంలో బార్
కౌన్సిల్ తీర్మానించింది. కానీ కార్యరూపం
దాల్చలేదు.
కేసు విచాణలో భాగంగా మైలార్డ్
అని ఎన్ని సార్లు సంబోధిస్తారని ప్రశ్నించిన న్యాయమూర్తి, అలా పిలవడం ఆపేస్తే తన
వేతనంలో సగం ఇస్తానంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు
సీనియర్ న్యాయమూర్తి పీఎస్. నరసింహ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో సీనియర్ న్యాయమూర్తి ఏఎస్ బోపన్న కలిసి ఓ కేసు వాదనలు వింటున్న
సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మైలార్డ్ అని గౌరవించడానికి బదులు సర్ అని
పిలవాలని సూచించారు. తన సలహా పాటించకపోతే మైలార్డ్ అనే పదం ఎన్ని సార్లు వాడేది
లెక్కపెడతానంటూ చమత్కరించారు.
మై లార్డ్,
యువర్ లార్డ్ షిప్ అనే మాటలు వలస పాలన ఆనవాళ్ళని, కోర్టు ప్రొసీడింగ్స్‌లో
వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది.