ప్రపంచకప్ ఓన్డేల్లో (ODI) భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. భారత జట్టులో గిల్ 92 పరుగులు, కోహ్లి 88, శ్రేయస్ 82 పరుగులతో జట్టు స్కోరును పెంచారు. 8 వికెట్ల నష్టానికి భారత్ 357 పరుగులు చేసింది.
358 పరుగుల విజయలక్ష్యంతో బరిన దిగిన శ్రీలంక జట్టు 19.4 ఓవర్లకే ఆలౌటైంది. లంక బ్యాటర్లను షమి, సిరాజ్ చిత్తుచేశారు. శ్రీలంక జట్టు 19.4 ఓవర్లకు 55 పరుగులు చేసి ఆలౌటైంది.లంక జట్టులో ఐదుగురు డకౌట్లు అయ్యారు. షమి 5, సిరాజ్ 3, బుమ్రా 1 వికెట్ తీశారు. శ్రీలంక జట్టులో ఒక్కరు కూడా చెప్పుదగ్గ స్కోరు చేయలేదు.
ప్రపంచకప్ వన్డేలో ఆడిన 7 మ్యాచ్లు గెలవడంతో భారత్ నేరుగా సెమీస్లోకి దూసుకెళ్లింది. మహ్మద్ షమి ప్రపంచ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి ఆటగాడుగా రికార్డులకెక్కాడు. మొత్తం 14 మ్యాచ్లు ఆడి 45 వికెట్లు తీశాడు.