టీడీపీ అధినేత చంద్రబాబు(CHANDRA BABU)పై సీఐడీ(AP CID) మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది.
ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్లో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి.
ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది.
చంద్రబాబుపై ఇది 5వ కేసు. చంద్రబాబుపై ఇప్పటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, మద్యం అనుమతుల కేసులు నమోదు అయ్యాయి. ఇక అంగళ్లు కేసులో ఇప్పటికే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
స్కిల్ కేసులో చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స అనంతరం ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకోనున్నారు.