వన్డే
క్రికెట్ ప్రపంచ కప్(CWC) -2023 టోర్నీలో భాగంగా నేడు భారత్,
శ్రీలంక(Bhrat vs
Srilanka)
మధ్య మ్యాచ్ జరుగుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 33వ మ్యాచ్లో
శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 50
ఓవర్లలో 357 పరుగులు చేసింది.
రోహిత్
శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మదుషంక రెండో బంతికే రోహిత్ శర్మ
బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. విరాట్,
గిల్ కలిసి ఆరు ఓవర్లకు 33 పరుగులు జోడించారు.15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు
88 పరుగులకు చేరింది. హేమంత్ వేసిన 16.1 వ బంతికి కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50
బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ టోర్నీల్లో 33 ఇన్నింగ్స్ ల్లో 13
సార్లు హాఫ్ సెంచరీ సాధించాడు. అందరికంటే ఎక్కువగా సచిన్ 44 ఇన్నింగ్స్ ల్లో 21 సార్లు
50 పైచిలుకు పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
శుభమన్
గిల్ కూడా మంచి ఆట కనబరిచాడు. 55 బంతుల్లో 52 పరుగులు సాధించి హాఫ్ సెంచరీ పూర్తి
చేశాడు.
25 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు ఒక
వికెట్ నష్టానికి 151 పరుగులు చేసింది.
92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభమన్
గిల్ ఔట్ అయ్యాడు. దిల్షాన్ మదుషంక వేసిన 29.6వ బంతికి కుశాల్ మెండిస్ కు క్యాచ్
ఇచ్చి తృటిలో సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ చేరాడు.92 బంతుల్లో 92 పరుగులు చేసి
వెనుదిరిగాడు.
మదుషంక
వేసిన 32వ ఓవర్ లో కోహ్లీ (88) ఔట్ అయ్యాడు. దీంతో 32 ఓవర్లకు భారత్ స్కోరు
199/3గా ఉంది. 39.2 బంతికి కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. 256 పరుగుల వద్ద భారత్
నాల్గో వికెట్ కోల్పోయింది. మధుషంక వేసిన 42 ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ (12),
క్యాచ్ ఔట్ అయ్యాడు. తీక్షణ వేసిన 43 ఓవర్ లో మూడో బంతికి శ్రేయస్ అయ్యర్ అర్ధ
శతకం పూర్తి చేశాడు. 45 ఓవర్లకు భారత్ స్కోరు 304/5. 48 ఓవర్లో వరుసగా రెండు
సిక్సులు బాదిన శ్రేయస్ అయ్యర్ ( 56 బంతుల్లో 82 ఆరు సిక్సులు, మూడు ఫోర్లు)
తర్వాతి బంతికే ఔటయ్యాడు.
మహ్మద్ షమీ
నాలుగు బంతులు ఆడి రెండు పరుగులు చేసి రన్ ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా కూడా
దూకుడుగా ఆడి స్కోరు బోర్డు స్పీడ్ పెంచాడు. 34 పరుగులుచేసి రన్ ఔట్ గా పెవిలియన్
చేరాడు.
నిర్ణీత 50 ఓవర్లకు భారత్ జట్టు 8 వికెట్లు నష్టపోయి
357 పరుగులుచేసింది. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మదుషంక ఐదు వికెట్లు తీయగా, చమీర 1
వికెట్ పడగొట్టాడు.