వన్డే
క్రికెట్ ప్రపంచ కప్(CWC) -2023 టోర్నీలో భాగంగా నేడు భారత్,
శ్రీలంక(Bhrat vs
Srilanka)
మధ్య మ్యాచ్ జరుగుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న 33వ మ్యాచ్లో
శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్
ప్రారంభించారు. మదుషంక రెండో బంతికే రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్
నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది.విరాట్, గిల్ కలిసి ఆరు ఓవర్లకు 33
పరుగులు జోడించారు.15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 88 పరుగులకు చేరింది.
శుభమన్ గిల్ (35), విరాట్ కోహ్లి(41) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. హేమంత్ వేసిన 16.1 వ బంతికి కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 50
బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ టోర్నీల్లో 33 ఇన్నింగ్స్ ల్లో 13
సార్లు హాఫ్ సెంచరీ సాధించాడు. అందరికంటే ఎక్కువగా సచిన్ 44 ఇన్నింగ్స్ ల్లో 21 సార్లు
50 పైచిలుకు పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.
శుభమన్
గిల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. 55 బంతుల్లో 52 పరుగులు సాధించి హాఫ్ సెంచరీ పూర్తి
చేశాడు.
25 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు ఒక వికెట్ నష్టానికి
151 పరుగులు చేసింది. శుభమన్ గిల్(65), విరాట్(75) బ్యాటింగ్ కొనసాగుతోంది.