విజయవాడ
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల షెడ్యూల్(BHAVANI MALADHARANA)ను శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు
ప్రకటించారు. 23.11.2023 నుంచి 7.1.2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు
తెలిపారు. నవంబరు 23 నుంచి 27 వరకు మండలదీక్ష
మాలధారణలు ఉంటాయన్నారు.
డిసెంబరు 13 నుంచి 17 వరకు అర్ధ మండల దీక్ష మాలధారణలు
జరగనున్నాయి.
డిసెంబరు
26 నుంచి సాయంత్రం కలశజ్యోతి మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీశివరామకృష్ణ క్షేత్రం,
సత్యనారాయణపురం విజయవాడ నుంచి ప్రత్యేక రథంలో శ్రీగంగా పార్వతి సమేత
శ్రీమల్లేశ్వరస్వామి కొలువై ఉండగా కలశజ్యోతులతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ అమ్మవారి
సన్నిధికి యాత్ర చేరనుంది.
వచ్చే
ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు గిరిప్రదక్షిణలు, భవానీ దీక్షా విరమణలు ఉంటాయని
ప్రకటనలో తెలిపారు. 3.1.2024 బుధవారం, మార్గశిర బహుళ సప్తమి ఉదయం గం.6.30
నిమిషాలకు అగ్నిప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరిప్రదక్షిణలు, భవానీ దీక్షల విరమణ
ప్రారంభం అవుతుంది.
7.1.2024
ఆదివారం మార్గశిర బహుళ ఏకాదశి ఉదయం మహాపూర్ణాహుతి, భవానీ దీక్షావిరమణల సమాప్తి
జరుగుతుందన్నారు.