తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (ts bjp third list) దగ్గరపడుతున్న వేళ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ అధిష్టానం తాజాగా 35 మందితో కూడా మూడో జాబితా విడుదల చేసింది. సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి బాబూమోహన్ సహా పలువురు ప్రముఖుల పేర్లు మూడో జాబితాలో చోటు చేసుకున్నాయి.
బాన్సువాడ యెండల లక్ష్మీనారాయణ, సనత్ నగర్ మర్రి శశిధర్‌రెడ్డి, ఆంథోల్ బాబూ మోహన్, మంచిర్యాల వీరబెల్లి రఘునాథ్, ఆసిఫాబాద్ అజ్మీరా ఆత్మారం నాయక్, బోధన్ వడ్డి మోహన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ దినేశ్ కులాచారి, మంథని చందుపట్ల సునీల్‌రెడ్డి, మెదక్ పంజా విజయ్‌కుమార్, నారాయణ్‌ఖేడ్ జనవాడె సంగప్ప, జహీరాబాద్ రామచంద్ర రాజ నరసింహా, ఉప్పల్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీనగర్ సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, పరిగి బోనేటి మారుతి కిరణ్, ముషీరాబాద్ పోసరాజు, మలక్‌పేట్ శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి పేర్లు ప్రకటించారు.
అంబర్‌పేట కృష్ణయాదవ్, జూబ్లీహిల్స్ లంకల దీపక్‌రెడ్డి, సికింద్రాబాద్ మేకల సారంగపాణి, నారాయణ్‌పేట్ రతంగ్ పండురెడ్డి, జడ్చర్ల చిత్తరంజన్ దాస్, మక్తల్
జలంధర్‌రెడ్డి, అచ్చంపేట్ దేవని సతీశ్ మాదిగ, షాద్‌నగర్ అండె బాబయ్య, దేవరకొండ కేతావత్ లాలూ నాయక్, హుజార్‌నగర్ చల్ల శ్రీలతారెడ్డి, నల్గొండ మాదగాని శ్రీనివాస్‌గౌడ్, ఆలేరు పడాల శ్రీనివాస్, పరకాల కాలి ప్రసాద్‌రావు, పినపాక పొడియం బాలరాజు, పాలేరు నున్న రవికుమార్, సత్తుపల్లి రామలింగేశ్వరరావు పేర్లను మూడో జాబితాలో ప్రకటించారు.
మొదటి జాబితాలో 55 మంది, రెండవ జాబితాలో ఒక పేరు, మూడో జాబితాలో 35 పేర్లు ప్రకటించారు. మొత్తం 91 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇంకా 28 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.