సభలో ప్రశ్నలు అడిగేందుకు పశ్చిమబెంగాల్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువా మొయిత్రా డబ్బు తీసుకునారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పార్లమెంటరీ ఐడీని దర్శన్ హీరానందానీకి ఇచ్చారని, అదానీ గ్రూపుపై 50కుపైగా ప్రశ్నలు వేశారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె చేసిన ఆరోపణలతో కేసు వెలుగు చూసింది.నగదు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు ఓ అఫిడవిట్ బయటకురావడం కూడా రాజకీయ దుమారానికి దారితీసింది. బీజేపీ ఎంపీ ఆరోపణలను మహువా తీవ్రంగా ఖండించారు.
పార్లమెంటరీ ఐడీ దుర్వినియోగం వ్యవహారాన్ని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. మహువాకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ మహువా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. తనకు లంచం ఇచ్చానని హీరానందాని అంగీకరించినట్లుగా ఉన్న అఫిడవిట్‌పై, ఆయన్ను ప్రశ్నించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఎథిక్స్ కమిటీని ఎంపీ మహువా కోరారు.