విపక్ష ఎంపీల ఫోన్లను కేంద్ర ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్ చేయబోతోన్నారంటూ మెసేజ్లు రావడంపై యాపిల్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. యాపిల్ సంస్థ పంపిన మెసేజ్లకు ఆధారాలుంటే సమర్పించాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది. హ్యాకింగ్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజన్సీ… కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ ఇండియాతో విచారణ చేయిస్తోంది.
విపక్ష ఎంపీల ఐఫోన్లకు హ్యాకింగ్ (iPhone Hacking) మెసేజ్లు రావడంపై ఆపిల్ సంస్థ స్పందించింది. మెసేజ్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని ప్రకటించింది. ఆపిల్ ఫోన్లకు కొన్ని నకిలీ అలర్ట్లు కూడా వస్తుంటాయని స్పష్టం చేసింది.
విపక్ష ఎంపీల ఫోన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాక్ చేయబోతున్నారంటూ మంగళవారం నాడు మెసేజ్లు రావడం తీవ్ర కలకలం రేపింది. 150 దేశాల్లో ఐఫోన్ వాడకందారులకు ఇలాంటి మేసేజ్లు వచ్చాయని ఆపిల్ సంస్థ ప్రకటించింది. వీటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. హ్యాకింగ్ అనుమానాలపై
సెర్ట్ఇన్ ద్వారా సమగ్ర విచారణ జరుపుతామని కేంద్రం ప్రకటించింది.