విద్యుత్
ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి
లంకా దినకర్ ప్రశ్నించారు. ఈ విషయమై బీజేపీ ఏడు నెలల కిందటే ప్రభుత్వాన్ని
నిలదీసిందన్న దినకర్.. విద్యుత్ ఉత్పత్తి
ప్రాజెక్టుల కోసం అర్హత లేని కంపెనీలకు రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల నిలువు దోపిడీకి తెరతీశారని
ఆరోపించారు.
రాయలసీమలోనే దాదాపు 1.50
లక్షల ఎకరాలు, బినామీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
షిర్డీసాయి
ఇంజినీరింగ్ లిమిటెడ్, ఇండోసోల్ కంపెనీలు ఎవరి బినామీ కంపెనీలో తేల్చాలన్నారు.
విద్యుత్
ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల సరఫరా టెండర్లు అస్మదీయులకే సీఎం జగన్ కట్టబెట్టడం
వెనుక మతలబేంటన్నారు.
ఇండోసోల్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
ప్రమోటర్లు ఒకరేన్నారు. ఈ కంపెనీలకు విదేశాల నుంచి సూట్కేస్
కంపెనీల ద్వారా వచ్చే నిధులు ఎవరివో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సుజ్లాన్
ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కథ అంతా రహస్యమే
అంటూ వ్యాఖ్యానించిన దినకర్.. అరబిందో రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 10 వేల ఎకరాలు కట్టబెడుతున్నారని, ఇది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న శరత్ చంద్రారెడ్డికి సంబందించిన కంపెనీ అని
వివరించారు.