మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్‌పై కానిస్టేబుల్ హత్యాయత్నం (crime news) చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ సీఐపై పదునైన ఆయుధంతో దాడికి తెగబడ్డాడని తెలుస్తోంది. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని ప్రాధమిక విచారణలో తేలింది.
సీఐ మర్మాంగాలను కోసేయడం, తలపై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. సీఐకు తొలుత మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రాధమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అహ్మద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి దిగిన కానిస్టేబుల్ భార్య కూడా పోలీస్‌గా పనిచేస్తున్నారు.
సమాచారం తెలియడంతో జోగులాంబ డీఐజీ చౌహాన్, జిల్లా ఎస్పీ హర్షవర్థన్, అదనపు ఎస్పీ రాములు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సీఐని పరామర్శించారు. మహబూబ్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.