Cricket World Cup Match South Africa Vs New Zealand
న్యూజీలాండ్‌తో పుణేలో జరిగిన మ్యాచ్‌లో
దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టోర్నీలో ఆరో విజయం
సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మళ్ళీ దక్కించుకుంది. న్యూజీలాండ్ జట్టు
వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోయి సెమీస్‌కు చేరుకోడానికీ చెమటోడ్చాల్సిన స్థితికి
పడిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి
ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 357 పరుగులు చేసింది. డసెన్ 133,
డికాక్ 114 పరుగులు సాధించారు. డికాక్ అయితే ప్రస్తుత వరల్డ్ కప్‌లో 4 సెంచరీలు
చేసిన మొదటి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు న్యూజీలాండ్ పూర్తిగా
లొంగిపోయింది. మూడో ఓవర్లో కాన్వే (2) ఔట్ అవడంతో కివీస్ పతనం మొదలైంది. రచిన్
కూడా 9 పరుగులకే ఔట్ అయిపోయాడు. 45 పరుగులకు 2 వికెట్ల నష్టంలో ఉన్న కివీస్, 100
పరుగులు పూర్తయేసరికి ఏకంగా 6 వికెట్లు నష్టపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లను
న్యూజీలాండ్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఆ సమయంలో ఫిలిప్స్ ధాటిగా
ఆడి 60 పరుగులు సాధించడంతో ఆ మాత్రం స్కోరయినా నమోదయింది. మొత్తం మీద 35.3 ఓవర్లలో
కేవలం 167 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్
మహరాజ్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసాడు. మార్కో జాన్సన్ 31 పరుగులిచ్చి 3
వికెట్లు సాధించాడు. కొయెట్జీ 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీసాడు. 133 పరుగులు
సాధించిన వాండర్ డసెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా
పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 గెలిచి, 2.290
నెట్‌రన్‌రేట్‌తో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. న్యూజీలాండ్ వరుసగా మూడో ఓటమితో
పట్టికలో దిగజారింది. ఆడిన 7 మ్యాచ్‌లలో 4 గెలిచి పటిష్టంగా ఉన్న కివీస్ జట్టు,
తర్వాత వరుసగా 3 మ్యాచ్‌లూ ఓడిపోయి, 4వ స్థానానికి చేరుకుంది.