దేశీయ స్టాక్ సూచీలు (stock market) భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తథాతథంగా కొనసాగించడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 501 పాయింట్ల లాభంతో 64092 వద్ద ట్రేడింగ్ మొదలైంది. 153 పాయింట్ల లాభంతో నిఫ్టీ 19142 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం 83.20 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్ నష్టాల్లో కొనసాగుతోంది.
బుధవారం అమెరికా, యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో మొదలయ్యాయి. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లులో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ట్రేడర్లు ఊపిరిపీల్చుకున్నారు.