వన్డే క్రికెట్ ప్రపంచకప్(CWC-2023)టోర్నీలో
భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్ లో సౌతాఫ్రికా, న్యూజీలాండ్(South Africa vs NewZealand) తల
పడుతున్నాయి. టాస్ గెలిచిన
న్యూజీలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు నాలుగు
వికెట్లు నష్టపోయి 357 పరుగులు చేసింది. కివీస్ ముందు 358 రన్స్ టార్గెట్ ఉంచింది.
సఫారీ జట్టు ఎనిమిదో ఓవర్ లోనే
తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు సారధి బవుమా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
24 రన్స్ చేసిన బవుమా క్యాచ్ ఇచ్చి
వెనుదిరిగాడు. సౌతాఫ్రికా 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 రన్స్ చేసింది.
వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, 62 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సఫారీ సేన 25 ఓవర్లకు 124పరుగులు చేసింది.
27వ
ఓవర్ ముగిసే సమయానికి డసెన్, డికాక్ వంద పరుగులను స్కోర్ బోర్డుకు జోడించారు. 28 వ ఓవర్ లో డసెన్ హాఫ్ సెంచరీ పూర్తి
చేశాడు. 61 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
103
బంతుల్లో క్వింటన్ డికాక్ శతకం కొట్టాడు. జేమ్స్ నీషమ్ వేసిన 35.6వ బంతిని సిక్స్
బాది సెంచరీ పూర్తి చేశాడు. వరల్డ్ కప్ టోర్నీలో నాలుగో సెంచరీని కొట్టి రికార్డు
సృష్టించాడు. ఈ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని డికాక్
గతంలో ప్రకటించాడు.
39వ
ఓవర్ 5 బంతికి ఇద్దరూ కలిసి 200 పరుగులు చేశారు. కానీ తర్వాతి బంతికి డికాక్,
క్యాచ్ ఔట్ అయ్యాడు. టిమ్ సౌతీ వేసిన బంతిని ఆడి గ్లీన్ ఫిలిప్స్ కు క్యాచ్
అందించి పెవిలియన్ చేరాడు. జేమ్స్ నీషమ్స్ వేసిన 41.5 బంతికి డస్సేన్ కూడా సెంచరీ
పూర్తి చేశాడు. 101 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. టిమ్ సౌతే వేసిన 47 .1 బంతికి డస్సేన్ బౌల్డ్ అయ్యాడు. 118
బంతుల్లో 133 పరుగులు చేశాడు.
48వ ఓవర్ ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల
నష్టానికి 325 పరుగులు చేసింది. తర్వాత డి మిల్లర్ (53)వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా
నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 357 పరుగులు చేసింది. కివీస్
బౌలర్లలో టిమ్ సౌతే రెండు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, నీషమ్ చెరో వికెట్ తీశారు.