మాజీ
ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి(VIVEK)
కాంగ్రెస్(CONGRESS) లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన
కొద్ది గంటల్లోనే ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) సమక్షంలో హస్తం గూటికి చేరారు.
కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన వివేక్, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పార్టీని వీడి
కేసీఆర్ పార్టీలో చేరారు. తర్వాత కారు దిగి బీజేపీలో చేరారు. ప్రస్తుతం మళ్లీ
కాంగ్రెస్ లో చేరారు.
వివేక్
తో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ లో చేరారు. కుమారుడి రాజకీయ భవిష్యత్
కోసమే వివేక్ కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. విశాక ఇండస్ట్రీస్ లో చేరి జేఎండీ బాధ్యతలు
చేపట్టిన వంశీ, ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి
కొడుకు కోసమే వివేక్ పార్టీ మారారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ను అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా
కాంగ్రెస్ లో చేరినట్లు వివేక్ చెప్పారు. టికెట్ అనేది తనకు ప్రాధాన్యం కాదన్నారు.
కేసీఆర్ తన కుటుంబం కోసమే
ఆలోచిస్తున్నారని విమర్శించారు.