స్టాక్ మార్కెట్లు (stock market) రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ బ్యాంకు ఇవాళ రాత్రి వడ్డీ రేట్లు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగారు. అమెరికా ఫ్యూచర్ మార్కెట్లోనూ ప్రతికూల అంశాలు, దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. రూపాయి మరింత బలహీనపడటం, షేర్ల అమ్మకాల ఒత్తిడి, యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ఇవాళ ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే ట్రేడైంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్ల నష్టంతో, 63,591 వద్ద, 90 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 18989 వద్ద ముగిశాయి.
సెన్సెక్స్ 30లో బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు లాభపడ్డాయి. మారుతి, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, కోటక్ మహీంద్రా షేర్లు అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. రూపాయితో డాలరు మారకం రూ.83.28 వద్ద నిలిచింది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల