టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడు(CHANDRA
BABU)కు హైకోర్టు
మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ షరతులపై సీఐడీ(CID) వేసిన
అనుబంధ పిటిషన్ తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.
స్కిల్
కేసు(SKILL CASE)లో భాగంగా
అరెస్టు అయి రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు
అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో చికిత్స కోసం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు
చేసింది. దీనిపై
ఆంక్షలు విధించాలని సీఐడీ కోర్టును
ఆశ్రయించింది.
రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనకుండా షరతులు విధించాలని
కోరింది. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం
చేయకుండా ఆదేశించాలని కోరింది. కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం చేయాలని
కోరింది.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారని వీడియో క్లిప్పింగ్స్
ను పెన్‌డ్రైవ్ లో కోర్టుకు సీఐడీ అప్పగించింది. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా
చంద్రబాబు మీడియాతో మాట్లాడారని తెలిపింది. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 13 గంటల
పాటు ర్యాలీగా వచ్చారని తెలిపారు.
సీఐడీ
కోరిన షరతులు చంద్రబాబు వ్యక్తిగత
స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తరఫు లాయర్లు వాదించారు.
చంద్రబాబు
మాట్లాడటం, ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే కానీ అతిక్రమణ కాదన్నారు. ఇరు పక్షాల
వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.
వైద్య
పరీక్షల నిమిత్తం చంద్రబాబు హైదరాబాద్ వెళుతున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి
రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. అక్కడ నుంచి హైదరాబాద్
చేరుకుంటారు.