అయోధ్యలో
నిర్మితమవుతున్న భవ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ్
ట్రస్ట్ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
గర్భగుడిలో
శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల
వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సింహాసనానికి
రాజస్థాన్ శిల్పులు తుది మెరుగులు దిద్దుతుండగా డిసెంబర్ 15 నాటికి అయోద్యకు
చేరుకుంటుందన్నారు.
వచ్చే
ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్టించనున్న శ్రీరామ జన్మభూమి తీర్థ్
ట్రస్ట్, డిసెంబర్ 15 నాటికి మొదటి
అంతస్తు నిర్మాణం పూర్తి చేయనుంది. పరిక్రమ మార్గ్ నిర్మాణం పూర్తి కాగా,
ప్రస్తుతం గృహ మండపం పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ
నెలాఖరుకు రామ మందిరం బయట ఉన్న ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని నిర్వాహకులు
చెబుతున్నారు. భక్తుల నుంచి కానుకులుగా అందిన బంగారు, వెండి వస్తువులను ప్రముఖ
సంస్థ ఆధ్వర్యంలో భద్రపరిచినట్లు తెలిపారు.