కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి(AP BJP CHIEF PURANDARESWARI) అన్నారు. కేంద్ర సాయంతో అంతర్జాతీయ హంగులతో
తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు.
కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ. 311 కోట్లు మంజూరు
చేసినట్లు వివరించారు. ఐఐటి, ఐజర్
లాంటి విద్యాసంస్థలకు కేంద్రం సుమారు రూ.800కోట్ల సాయం అందించిందన్నారు.
స్మార్ట్
సిటీగా తిరుపతిని మార్చేందుకు రూ.1,695కోట్లను కేటాయించి 87 అభివృద్ధి
కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
తిరుపతిలో 21వేల తాగునీటి కనెక్షన్లు, 16వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి
కేంద్రం తోడ్పాటు అందించిందన్నారు.
తిరుపతిలో పర్యటించిన పురందరేశ్వరి, రైల్వే స్టేషన్
నిర్మాణ పనులు పరిశీలించారు. కేంద్రప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న
విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
కేంద్రసహకారాన్ని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివరించడం
లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1700కోట్ల రూపాయల కేంద్రప్రభుత్వ నిధులతో
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు.